WEBVTT

00:00:02.200 --> 00:00:05.200 align:middle
హలో! నా పేరు షాదీ అబూ-జరా.

00:00:05.400 --> 00:00:09.600 align:middle
నేను డబ్ల్యూ3సి (W3C) వద్ద యాక్సెసబిలిటీ స్ట్రాటెజీ మరియు టెక్నాలజీ నిపుణుడిని.

00:00:09.800 --> 00:00:11.840 align:middle
ఇది ఒక వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం

00:00:12.040 --> 00:00:15.360 align:middle
ఈరోజు నేను మీకు వెబ్ యాక్సెసబిలిటీ (ప్రవేశ సౌలభ్యత) గురించి చెప్పాలనుకుంటున్నాను.

00:00:15.560 --> 00:00:19.240 align:middle
మీలో చాలా మందికి వెబ్ అనేది మీ దైనందిన జీవితంలో ఒక అతి ముఖ్యమైన భాగం

00:00:19.440 --> 00:00:21.080 align:middle
పని చేసే చోట కావచ్చు

00:00:21.240 --> 00:00:22.840 align:middle
ఇంటి వద్ద కావచ్చు.

00:00:23.000 --> 00:00:24.880 align:middle
ఇంకా రోడ్ మీద కూడా.

00:00:25.080 --> 00:00:29.640 align:middle
వెబ్ యాక్సెసబిలిటీ అంటే వైకల్యాలను కలిగిన వారు సైతం సరిసమానంగా వెబ్‌ను వినియోగించవచ్చు అని అర్ధం.

00:00:29.840 --> 00:00:35.360 align:middle
ఉదాహరణకు, తమ చేతులతో టైపు చేయలేనివారు, ఒక నోటి కర్రను ఉపయోగించి టైపు చేస్తారు.

00:00:35.560 --> 00:00:40.240 align:middle
లేదా సరిగ్గా వినలేని వారు, వీడియోలను చూసేందుకు క్యాప్షన్లను ఉపయోగిస్తారు.

00:00:40.400 --> 00:00:45.800 align:middle
లేదా సరిగ్గా చూడలేనివారు, స్క్రీన్ మీద ఉన్న దానిని బిగ్గరగా చదివేందుకు ఒక స్క్రీన్ రీడర్‌ను ఉపయోగిస్తారు

00:00:46.080 --> 00:00:48.480 align:middle
యాక్సెసబిలిటీ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

00:00:48.760 --> 00:00:54.280 align:middle
ఉదాహరణకు, నిశ్శబ్దంగా ఉన్న లేదా సందడిగా ఉన్న వాతావరణాలలో క్యాప్షన్లు అనేవి ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటాయి.

00:00:54.440 --> 00:00:58.120 align:middle
కళ్ళు చెదురుతున్నప్పుడు, చక్కటి కలర్ కాంట్రాస్ట్ బాగా పని చేస్తుంది.

00:00:58.280 --> 00:01:03.960 align:middle
క్షీణించిన దక్షతా ప్రయోజనం వంటి వయో సంబంధిత అశక్తత సమస్యలు ఉన్న వారికి కూడా.

00:01:04.120 --> 00:01:09.120 align:middle
వాస్తవానికి, మెరుగుపరచబడిన లేఅవుట్ మరియు డిజైన్‌తో ప్రతి ఒక్కరూ ఉత్తమమైన ఉపయోక్త అనుభవాన్ని పొందుతారు.

00:01:09.280 --> 00:01:14.760 align:middle
వెబ్‌సైట్లు మరియు అప్లికేషన్ల మూలాధార కోడ్‌లో, యాక్సెసబిలిటీని మరింతగా నిర్మించవచ్చు.

00:01:15.000 --> 00:01:21.640 align:middle
డబ్ల్యూ3సి (W3C) నుండి HTML వంటి వెబ్ టెక్నాలజీలు అనేక యాక్సెసబిలిటీ సంబంధిత విశేషాంశాలకు మద్దతును అందిస్తాయి.

00:01:23.120 --> 00:01:27.920 align:middle
ఉదాహరణకు, ఇమేజ్‌లకు టెక్స్ట్ ప్రత్యామ్నాయాలను అందించే విశేషాంశాలు,

00:01:28.480 --> 00:01:33.080 align:middle
వీటిని స్క్రీన్ రీడర్లు బిగ్గరగా చదవుతాయి, ఇంకా శోధనా ఇంజన్ల చేత కూడా ఉపయోగించబడతాయి.

00:01:34.640 --> 00:01:39.400 align:middle
ఇంకా, హెడ్డింగ్‌లు, లేబుల్స్ మరియు ఇతర కోడ్ ఆధారిత యాక్సెసబిలిటీ కూడా, 

00:01:39.880 --> 00:01:42.680 align:middle
ఇవి సమగ్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.

00:01:43.320 --> 00:01:49.840 align:middle
వికీలు, కంటెంట్ యాజమాన్య వ్యవస్థలు మరియు కోడ్ ఎడిటర్ల వంటి, చక్కటి ఆథరింగ్ టూల్స్‌

00:01:50.600 --> 00:01:56.760 align:middle
ఆటోమ్యాటిక్‌గా కానీ లేదా ఆథర్ నుండి పొందే ఇన్‌పుట్‌తో కానీ యాక్సెసబిలిటీ కోడ్‌ను రూపొందించేందుకు సహాయపడతాయి.

00:01:57.440 --> 00:02:04.480 align:middle
వెబ్ బ్రౌజర్లు, మీడియా ప్లేయర్లు మరియు యాప్‌లు కూడా యాక్సెసబిలిటీ విశేషాంశాలకు మద్దతును అందించవలసి ఉంటుంది.

00:02:05.480 --> 00:02:09.600 align:middle
డబ్ల్యూ3సి (W3C) ఒక వెబ్‌కు ప్రవేశ సౌలభ్యాన్ని కల్పించడంలో తోడ్పడేందుకు గానూ ప్రమాణాలను అందిస్తుంది,

00:02:10.040 --> 00:02:13.920 align:middle
అవి అంతర్జాతీయంగా ప్రభుత్వాలు మరియు వ్యాపార రంగాల చేత గుర్తింపు పొందినవి.

00:02:14.480 --> 00:02:19.880 align:middle
WCAG – వెబ్ కంటెంట్ యాక్సెసబిలిటీ గైడ్‌లైన్స్ అత్యంత ప్రాముఖ్యమైనవి.

00:02:20.680 --> 00:02:24.240 align:middle
WCAGలు ఐఎస్‌ఒ స్టాండర్డ్ 40500 కలిగి,

00:02:24.600 --> 00:02:29.840 align:middle
EN 301 549 అనే యూరోపియన్ స్టాండర్డ్‌లో అవలంబించబడ్డాయి.

00:02:30.520 --> 00:02:33.360 align:middle
ఇది నాలుగు కీలక నియమాలతో నిర్మించబడినది:

00:02:33.560 --> 00:02:39.920 align:middle
మొదటిది, పర్సివిబుల్ – ఉదాహరణకు, విషయాన్ని చూడగలిగిన వారు లేదా వినగలిగిన వారి కొరకు.

00:02:40.880 --> 00:02:47.160 align:middle
ఆపరబుల్ – ఉదాహరణకు, టైప్ చేసి లేదా వాయీస్ ద్వారా కంప్యూటర్‌ను ఉపయోగించగలిగిన వారు.

00:02:48.000 --> 00:02:53.360 align:middle
అండర్స్టాండబుల్ – ఉదాహరణకు, స్వచ్ఛమైన, సులువైన భాషను పొందుతారు.

00:02:54.120 --> 00:02:58.600 align:middle
రాబస్ట్ – వేర్వేరు అసిస్టివ్ టెక్నాలజీలను ఉపయోగించగలరు.

00:02:59.360 --> 00:03:07.000 align:middle
WCAG తో బాటుగా, ATAG – ఆథరింగ్ టూల్స్ యాక్సెసబిలిటీ గైడ్‌లైన్లను కూడా W3C అందిస్తుంది, 

00:03:07.440 --> 00:03:12.840 align:middle
కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంలు, కోడ్ ఎడిటర్లు మరియు ఇతర సాఫ్ట్‌వేర్ కొరకు కావలసిన ఆవశ్యకతలను ఇది వివరిస్తుంది.

00:03:13.240 --> 00:03:16.880 align:middle
ఇంకా UAAG – యూజర్ ఏజెంట్స యాక్సెసిబిలిటీ గైడ్‌లైన్స్‌ను కూడా అందిస్తుంది,

00:03:17.160 --> 00:03:20.480 align:middle
వెబ్‌ బ్రౌజర్లు మరియు మీడియా ప్లేయర్ల కొరకు కావలసిన ఆవశ్యకతలను ఇది వివరిస్తుంది.

00:03:21.000 --> 00:03:27.280 align:middle
జనాభాలో దాదాపుగా 15-20% వరకు లేదా ఒక బిలియన్‌కు పైగా వైకల్యం కలిగిన వారు ఉన్నారు.

00:03:28.160 --> 00:03:31.880 align:middle
వైకల్యాలు కలిగిన వ్యక్తుల హక్కుల మీద యుఎన్ కన్వెన్షన్

00:03:32.040 --> 00:03:37.040 align:middle
వెబ్‌తో సహా సమాచారానికి ప్రవేశ సౌలభ్యాన్ని ఒక మానవీయ హక్కుగా ఇది వివరిస్తుంది.

00:03:38.800 --> 00:03:42.920 align:middle
ఈ యుఎన్ కన్వెన్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు సమ్మతించాయి,

00:03:43.160 --> 00:03:46.960 align:middle
బైండింగ్ విధానలను కూడా పలు దేశాలు అవలంబించాయి.

00:03:48.040 --> 00:03:51.000 align:middle
ఏవైనా చట్టాలు మరియు నిబంధనలతో సంబంధం లేకుండా,

00:03:51.160 --> 00:03:56.000 align:middle
యాక్సెసబిలిటీ ప్రమాణాలను అమలుపరచడం అనేది వైకల్యంతో ఉన్న వారికి ఎంతో అవసరం,

00:03:56.160 --> 00:03:57.800 align:middle
అందరికీ ఉపయోగకరం కూడానూ.

00:03:59.000 --> 00:04:05.880 align:middle
వెబ్ యాక్సెసబిలిటీ మీద మరింత సమాచారం కొరకు w3.org/WAI ను సందర్శించండి
